Tuesday, April 16, 2024

హైదరాబాద్‌ హైటెక్స్‌లో కియా ఈవీ6 లాంచ్‌.. ఆవిష్కరించిన నటి క్యాథెరిన్‌

హైదరాబాద్‌ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా.. ఎలక్ట్రిక్‌ కారును తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ కారును హైదరాబాద్లో ప్రదర్శించారు. హైటెక్‌ సిటీ ప్రాంతంలో జరిగిన కియా ఈవీ6 ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ నటి క్యాథెరిన్‌, సినీ కొరియో గ్రాఫర్‌ జానీ మాస్టర్‌తో పాటు కియా ప్రతినిధులు రఘు, గౌతమ్‌, షోరూం ప్రతినిధి చెన్న కేశవ, సీఓఓ జీఎం వరప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ.3లక్షల టోకెన్‌ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 100 మంది వినియోగదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022లో విడుదల చేయనున్నట్టు కియా ప్రతినిధులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లోనే కియా ఈవీ6ను లాంచ్‌ చేయగా.. అందులో హైదరాబాద్‌ ఒకటి.

కియా ఈవీ6 ప్రత్యేకతలు..

ఈ కియా ఈవీ6.. ఈ-జీఎంపీపై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, అసాధారణ పనితీరుగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌ 77.4 కిలో వాట్‌ హవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2 డబ్ల్యూడీలో ఉత్పత్తి చేయడంతో పాటు ఏడబ్ల్యూడీ వేరియంట్‌లో 325 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే.. 528 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్స్‌లో అందుకుంటుంది. సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసింజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రతా పరంగా 8 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉన్నాయి. మూన్‌ స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూ రంగుల్లో లభిస్తాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement