Friday, April 26, 2024

ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

సినీనటి ఖుష్బూ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే ఖుష్బూ కు షాక్ ఇచ్చారు హ్యాకర్స్. గతంలో ఓసారి ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఇప్పుడు మరోసారి హ్యాక్ చేశారు. కాగా ఈసారి హ్యాక్ చేసినవారు ఖుష్బూ పేరుని బ్రియాన్ గా మార్చడమే కాకుండా… ఆమె ఫోటో ను కూడా మార్చేశారు.

అలాగే ఖుష్బూ చేసిన ట్వీట్స్, పోస్ట్ లు అన్ని డిలీట్ చేశారు. ఇదే విషయాన్ని చెబుతూ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పుకొచ్చారు ఖుష్బూ. గత మూడు రోజుల నుంచి పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా అవ్వటం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement