Thursday, April 25, 2024

ముగిసిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.. వార్‌ వన్‌సైడ్‌ అంటున్న ఖర్గే

సుమారు 24 సంవత్సరాల తర్వాత గాంధీ కుటుంబేతరుల మధ్య జరిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం సజావుగా ముగిశాయి. దేశవ్యాప్తంగా సుమారు 9 వేల మంది డెలిగేట్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో 96 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్‌ మిస్త్రీ ప్రకటించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగినట్లు మిస్త్రీ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన సీనియర్‌ నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

వార్‌ వన్‌సైడ్‌ – ఖర్గే

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మీకు పూర్తి మెజార్టీ లభిస్తుందని ఒక వర్గం అభిప్రాయ పడిందని, మీరు గెలిస్తే, ఆ ప్రచారం వాస్తవమని భావించాలా అని మీడియా ఖర్గేను ప్రశ్నించగా, ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌

- Advertisement -

జరిగిందా,లేదా అనే విషయం ఊహించి చెప్పలేమని ఖర్గే సమాధానం ఇచ్చారు. 19వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలుతుందని ఆయన అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. అంతకు మించి ఏమి చెప్పినా, చాలా ఎక్కువ ఇగో అంటారని ఖర్గే అన్నారు. కాగా, గాంధీల మనిషిగా ఖర్గేకు ప్రచారం లభించింది. ప్రచారం నిమిత్తం వచ్చిన ఖర్గేకు రాష్ట్ర పీసీసీలు ఘన స్వాగతం పలికాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement