Friday, February 3, 2023

ఖమ్మం బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది : మంత్రి హ‌రీష్ రావు

ఖమ్మం జిల్లాలో నిర్వ‌హించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించబోతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా బలపరుస్తున్నారన్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి దగ్గర నుంచి అఖిలేష్ యాదవ్ వరకు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దేశానికి దశ దిశ బీఆర్ఎస్ చూపిస్తుందన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పనిసరిగా ఈ జాతికి ఉత్తమ సేవలందిస్తారని మంత్రి హరీష్‌రావు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement