Friday, April 19, 2024

రాజ్‌భవన్‌లో గవర్నర్ నిరాహార దీక్ష

ప్రజా సమస్యలు లేదా ఇతర సమస్యలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సర్వ సాధారణమే. అప్పుడప్పుడూ అధికారంలో ఉన్న పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు. కానీ గవర్నర్‌ దీక్ష చేయడం చాలా అరుదు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాజ్‌భవన్‌లో నిరహార దీక్షకు దిగారు.

తిరువనంతపురంలోని తన కార్యాలయంలో బుధవారం నాడు గవర్నర్ నిరసన దీక్షకు కూర్చున్నారు. వరకట్నం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే గవర్నర్ దీక్ష చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు మద్దతుగా వివిధ గాంధేయవాద సంస్థలు కేరళ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. వరకట్నం వల్ల కేరళలో వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుండడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురాచారాన్ని అరికట్టడానికి తాను స్వచ్ఛందంగా పనిచేస్తానని గవర్నర్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: వైసీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement