Saturday, April 20, 2024

ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్స్‌జెండర్ అనన్య ఆత్మహత్య

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్ప్ జెండర్ ఉమెన్, ఆర్‌జే అనన్య కుమారి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో నిన్న ఉరి వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతేడాది సర్జరీ చేయించుకున్నప్పటి నుంచి ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాగా అనన్య ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి వార్తల్లో నిలిచింది.

2020లో అనన్య కుమారి కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో వెజినోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఏడాది తరువాత కూడా ఆమె అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. కాగా అనుమానా స్పద స్థితిలో లభ్యమైన అనన్య మృతదేహాన్ని అధికారులు ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా అనన్య తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చే్స్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement