Thursday, April 18, 2024

Big Breaking | మోదీ విద్యా అర్హతలపై కేజ్రీవాల్​ పిటిషన్​.. సమయం వృథా చేశారంటూ హైకోర్టు 25వేల ఫైన్​

ప్రధాని నరేంద్ర మోదీ విద్యా అర్హతల గురించిన వివరాలు కావాలని గుజరాత్​ హైకోర్టులో ఆప్​ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ వేసిన పిటిషన్​పై తీర్పు వెలువడింది.  ఈ విషయంలో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను పిటిషన్​దారు అయిన అర్వింద్ కేజ్రీవాల్​కు ధర్మాసనం 25వేల ఫైన్​ విధించింది. అంతేకాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం మోదీకి సంబంధించిన ఎలాంటి డిగ్రీ, పోస్ట్​ గ్రాడ్యుయేట్​ సర్టిఫికెట్లను అందించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అందించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు ఇవ్వాల (శుక్రవారం) తీర్పునిచ్చింది. మోదీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రధాన సమాచార కమిషన్ (సీఐసీ) పీఎమ్‌ఓ, గుజరాత్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ యూనివర్శిటీ పీఐఓలకు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి బీరెన్ వైష్ణవ్‌తో కూడిన ఒక న్యాయమూర్తి ప్యానెల్ తోసిపుచ్చింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికేట్ కు చెందిన వివరాలను, వాటి ప్రత్యేకతలను అందజేయాలని చేసిన అభ్యర్థన గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా.. అతనిపై 25వేల రూపాయల జరిమానా కూడా విధించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నిర్ణయాన్ని గుజరాత్ యూనివర్సిటీ అప్పీల్ చేయగా, హైకోర్టు ఇప్పుడు దానిని విచారిస్తోంది.

అంతేకాకుండా..  “ప్రజాస్వామ్యంలో, పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. అలాగే, ఈ అంశంలో ప్రజాప్రయోజనాల ప్రమేయం లేదు. అతని గోప్యత కూడా దెబ్బతింటుంది” అని ఓ వెబ్‌సైట్ బార్ అండ్ బెంచ్ యూనివర్శిటీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఊటంకిస్తూ వార్త వెలువరించింది. తాను 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పేర్కొనడం విశేషం.

- Advertisement -

కేజ్రీవాల్ తరపు న్యాయవాది పెర్సీ కవీనా వాదిస్తూ, “మీరు దాఖలు చేసిన నామినేషన్ ఫారమ్‌ను (ఎన్నికల సమయంలో దాఖలు చేసిన) చూస్తే.. అది అతని విద్యార్హతలను తెలియజేస్తోంది. అందుకనే తాము డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నామని, అతని మెరిట్​ కాదని వాదనలు వినిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement