Wednesday, April 24, 2024

మ‌హాన‌టి ప్రేమ‌క‌థ‌

ఇటీవల పలువురు సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ, విడాకులు వంటి అంశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహానటి ఫేమ్‌ కీర్తి సురేష్‌కు కూడా లవ్‌స్టోరీ ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చెల్‌ చేస్తోంది. అదేమంటే కీర్తి సురేష్‌ ప్రేమలో ఉన్నట్టు ఆ వార్త సారాంశం.
తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ అగ్రశ్రేణి నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమలో ఉందని అంటున్నారు. పుష్కరంకు పైగా వీరిద్దరి మధ్య రహస్య బంధం ఉందని కథానాలు తెలుపుతు న్నాయి. స్నేహితుడు ఓ వ్యాపారి అని, అతనికి కేరళలో ఆస్తులు, రిసార్ట్స్‌ ఉన్నాయని కూడా తెలిపింది. అయితే వీరిద్దరు ఇప్పుడే పెళ్లి చేసుకోరట. ఇది కొసమె రుపు. నాలుగేళ్ళ తర్వాత వివాహబంధంతో ఒక్కటవుతారని అంటున్నారు. ఇక కీర్తి సురేష్‌కు సంబంధించి ప్రేమ, పెళ్లి వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఓ మ్యూజిక్‌ కంపోజర్‌తో ప్రేమ వ్యవహారం ఉందని, కాదు ఓ వ్యాపారవెత్తుతో ఆల్‌రెడీ వివాహం జరిగిందని ఇలా వదంతలు వినిపిస్తున్నాయి. తాజాగా తమిళ అగ్రనటుడుతో కీర్తి ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. వీటిపై కీర్తి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement