Thursday, March 28, 2024

త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక?

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ సందర్భంగా పలువురు నేతలతో పాటు నటీనటులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా దుబ్బాక ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కత్తి కార్తీక త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కత్తి కార్తీకను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ కత్తి కార్తీకను స్వయంగా కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు. మధుయాష్కీ ఆహ్వానాన్ని మన్నించి త్వరలోనే కత్తి కార్తీక టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచే కొత్త రేషన్ కార్డుల జారీ

Advertisement

తాజా వార్తలు

Advertisement