Saturday, April 20, 2024

కరీంనగర్ – ముంబాయి లోకమాన్య తిలక్‌ రైలును పున: ప్రారంభించాలి.. రైల్వే బోర్డుకు విన‌తి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరీంనగర్‌ నుంచి ముంబయికి వెళ్లే లోకమాన్య తిలక్‌ రైలును పున: ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ రైల్వే బోర్డు చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ త్రిపాఠికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ నుంచి బయలుదేరి జగిత్యాల, కోరుట్ల, మెట్‌ పల్లి, ఆర్మూర్‌, నిజామాబాద్‌ మీదుగా ముంబయికి వెళ్లే లోకమాన్య తిలక్‌ రైలు కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంగా మొదటి దఫా లాక్‌డౌన్‌ సమయంలో నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. తాను కరీంనగర్‌ ఎంపీగా ఉన్న సమయంలో లోకమాన్య తిలక్‌ రైలును కరీంనగర్‌ నుంచి ముంబయికి ప్రారంభించినట్లు వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ రైలు సేవలు నిలిచిపోవడంతో ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు ముంబయికి నేరుగా వెళ్లే అవకాశాలు లేకుండా పోయాయని వినోద్‌ కుమార్‌ వివరించారు. ఈ పరిస్థితుల దృష్య్టా వెంటనే లోకమాన్య తిలక్‌ రైలు సేవలను తిరిగి ప్రారంభించాలని వినోద్‌ కుమార్‌ రైల్వే బోర్డు చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ త్రిపాఠిని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement