Thursday, November 28, 2024

Karimnagar – కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ రహ‌దారికి మ‌హ‌ర్ద‌శ‌

ఆంధ్రప్రభ స్మార్ట్‌, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న కొత్తపల్లి- హుస్నాబాద్ రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్త‌రించేందుకు ఫేజ్ -2 లో భాగంగా రూ.77.20 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రయాణికుల సమస్యలు తీర్చిన సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కకి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సంద‌ర్భంగా పొన్నం ధన్యవాదాలు తెలిపారు కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వచ్చే సమస్యలు పరిష్కారం అవుతుండడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement