Friday, March 31, 2023

ఆఫ్రికా ట్రిప్ లో కరీనా కపూర్ దంప‌తులు

ఆఫ్రికా ట్రిప్ లో ఉన్నారు బాలీవుడ్ న‌టులు క‌రీనాక‌పూర్ దంప‌తులు.ఈ మేర‌కు కొత్త ఫ్రెండ్స్ తో ఉన్నాన‌ని క‌రీనాక‌పూర్ చెప్పారు. కాగా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఆఫ్రికాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ కుమారులు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ లతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అక్కడ ఒక సఫారీ రిసార్ట్ లో ఉన్న ఫొటోను కరీనా షేర్ చేసింది. ఈ ఫొటోలో కరీనా సోఫాలో పడుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో మేత మేస్తున్న జీబ్రాలు కనిపిస్తున్నాయి. ఈ పిక్ లో బ్లూ డెనిమ్ టాప్ తో కరీనా చాలా క్యూట్ గా కనిపిస్తోంది. కొత్త ఫ్రెండ్స్ తో ఉన్నా అంటూ ఫొటోకు కరీనా క్యాప్షన్ పెట్టింది. తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను కరీనా ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పంచుకుంటోంది. మరోవైపు కరీనా ఫొటోపై ఆమె మరదలు సబా పటౌడీ రెడ్ హార్ట్ ఎమోజీలను పెట్టి స్పందించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement