Saturday, April 20, 2024

ఈనెల 15న రిలీజ్ కానున్న కాంతార-ట్రైల‌ర్ రిలీజ్

హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్ నుంచి కొత్త చిత్రం రిలీజ్ అయింది. కాంతారా టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం కన్నడంలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “కాంతారా” సినిమాను రిలీజ్ చేయనున్నారు. కాంతారా అంటే సంస్కృత భాషలో అడవి అని అర్థం. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది కూడా డెఫినెట్ గా మంచి వసూళ్లు సెట్ చేస్తుందని అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసారు. తెలుగులో ఈనెల 15న ‘కాంతార’ మూవీని విడుదల చేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement