Thursday, April 25, 2024

బాలీవుడ్ లోకి ‘కాంతార’ హీరోయిన్ ఎంట్రీ

‘పాప్‌ కార్న్‌ మంకీ టైగర్‌’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి వ‌చ్చిన స‌ప్త‌మి గౌడ్ ఆ తర్వాత ‘కాంతార’తో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీకి బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ‘ది కాశ్మీరీ ఫైల్స్’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్ని హోత్రీ దర్శకత్వం వహిస్తున్న ‘ది వాక్సిన్‌ వార్‌’ సినిమాలో కీల‌క‌పాత్ర కు ఎంపికైంది. అనుపమ్‌ ఖేర్‌, నానా పటేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇలా మూడో సినిమాకే సప్తమీకి బాలీవుడ్‌ ఆఫర్‌ వరించడం విశేషమనే చెప్పాలి. దీనితో పాటు సప్తమీ గౌడ కన్నడంలో మ‌రో మూడు సినిమాలోనూ నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement