Thursday, April 25, 2024

కాంతార క్లైమాక్స్ అద్భుతం..నిర్మాత శోభు యార్లగడ్డ

కాంతార మూవీని తాను చూశానని మైండ్ బ్లోయంగ్ చిత్రమని ప్రశంసలు కురిపించారు నిర్మాత శోభుయార్లగడ్డ.
హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌లో విజయ్‌ కిరగందూర్‌ తెరకెక్కించారు. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 30న మాతృక భాష కన్నడలో విడుదలై భారీ రికార్డులు సృష్టిస్తోంది.ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి టాక్‌తో కలెక్షన్లు వసూళ్లు చేస్తోంది. భారత సినీ పరిశ్రమలో వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్‌ ప్రొడ్యూసర్‌ అయిన అల్లు అరవింద్‌ ఇప్పటికే కాంతారపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా ఇపుడు బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్‌ అయ్యారు. ఈ సినిమాలాగా ఏ సినిమా నన్ను టచ్‌ చేయలేదు..ఓరి దేవుడా క్లైమాక్స్ అద్బుతంగా ఉంది. దయచేసి థియేటర్లలో చూడండి! ఏం యాక్టింగ్‌, సినిమాటోగ్రఫీ, సంగీతం..రిషబ్‌ శెట్టి, హోంబయే ఫిలిమ్స్‌ టీంకు జయహో అనాల్సిందే..అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement