Saturday, April 20, 2024

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి వరుస ట్వీట్స్ చేస్తూ రెచ్చగొడుతుండటంతో అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. కాగా కంగనాకు గతంలోనూ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘తాండవ్’పై రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేశాయని, మేకర్స్ సిగ్గుతో తలదించుకోవాలంటూ ట్వీట్స్ చేయగా.. కంగన ఈ ప్లాట్‌ఫామ్‌ సంబంధిత అబ్యూజివ్ బిహేవియర్ పాలసీని ఉల్లంఘించినట్లయింది. పైగా పర్టిక్యులర్‌గా ఒకరిని అలా టార్గెట్ చేస్తూ హెరాస్ చేయడం నిషేధం కాబట్టి తన అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement