Tuesday, April 16, 2024

‘విడాకుల సంస్కృతి’ పై స్పందించిన కంగనా

బాలీవుడ్ హాట్ బాండ్ కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత నిన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇన్నాళ్లూ స్పందించని సమంత, చై ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ బయట పెట్టారు. అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. కంగనా రనౌత్ మాట్లాడుతూ మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల దయ చూపడం మానేయండి అని ప్రజలను కోరింది. ఈ ఆకతాయిలు అభిమానుల నుండి ప్రశంసలు అందుకోవడం సిగ్గుచేటు అని కూడా ఈ నటి పేర్కొన్నారు, అయితే రిలేషన్ లో ఉన్నప్పుడు మహిళ గురించే ఎప్పుడూ తీర్పులు చెబుతారని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: మా ఎల‌క్ష‌న్స్: తుది అభ్య‌ర్ధుల జాబితా ఇదే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement