Thursday, April 25, 2024

పునీత్ చ‌నిపోయారంటే న‌మ్మ‌లేక‌పోతున్నా.. రామ్ చ‌ర‌ణ్..

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాత్త్ గా గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. సొంత కుటుంబ సభ్యులు దూరమైనట్టు ఉంది. ఆయన చనిపోయారంటే నేను నమ్మలేకపోతున్నా.. అంటూ ఎమోషనల్ అయ్యారు . పునీత్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాన‌ని తెలిపారు. పునీత్ హఠాత్మరణంతో టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆయన మరణంతో టాలీవుడ్ సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్ , చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ , అలీ ఇలా పలువురు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement