Wednesday, March 27, 2024

HRCని ఆశ్రయించిన కామారెడ్డి రైతులు

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి రైతులు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) ని ఆశ్రయించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్ లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పని చేస్తున్నారని ఆరోపించారు. తమపై దాడికి కారణమైన జిల్లా కలెక్టర్, పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కామారెడ్డి రైతులు HRCని వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement