Wednesday, April 24, 2024

రజనీకి అవార్డు రావడంపై స్పందించిన కమల్

ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సూపర్ స్టార్ రజనీకాంత్ కు రావడం పై కమల్ హసన్ స్పందించాడు. నా ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. ఈ పురస్కారం ఆయనకు దక్కడం సంతోషంగా ఉంది’ అని కమల్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ కలిసి 16 సినిమాలలో నటించడం గమనార్హం. చివరిసారిగా 1985లో బాలీవుడ్ మూవీ ‘గిరఫ్తార్’లో వీరు నటించారు. ఇద్దరూ కలిసి మరోసారి నటించబోతున్నారనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నప్పటికీ… ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రజనీకి దాదాసాహెబ్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు. భారతీయ సినీ పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఒకరైన రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement