Friday, April 19, 2024

హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయిన కమల్ హాసన్.. విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్స్

హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు విశ్వనటుడు కమల్ హాసన్. అనారోగ్యం కారణంగా ఆయన బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ కు వెళ్లారు. అన్ని పరీక్షలు చేసిన అనంతరం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కమల్ కు వైద్యులు సూచించారు. అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. కమల్ హాసన్ అనారోగ్యం వార్త అభిమానులను కలవరానికి గురి చేసింది. బుధవారం హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా కమల్ హాసన్, తన గురువు సమానులైన దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ ను కలుసుకోవడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement