Friday, April 19, 2024

గండికోటలో కమల్ హాసన్ సందడి

కడప : జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని రాజరికం వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా, గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న గండికోటలో సీనియర్ హీరో కమల్ హాసన్ సందడి చేస్తున్నారు. గండికోటలో భారతీయుడుకు సీక్వెల్ గా డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు-2 సినిమా షూటింగ్ ఆరు రోజుల పాటు కొనసాగనుంది. షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చిన హీరో కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement