Friday, March 29, 2024

డెవిల్ నుండి క‌ల్యాణ్ రామ్ లుక్.. మ‌రో ప్ర‌యోగ‌మా

హీరో క‌ల్యాణ్ రామ్ కొత్త చిత్రాల‌ను లైన్ లో పెడుతున్నారు. కాగా ద‌ర్శ‌కుడు నవీన్ మేడారం డైరెక్ష‌న్ లో న‌టిస్తోన్న చిత్రం డెవిల్.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ నుంచి ఉగాది సందర్భంగా క్రేజీ పోస్టర్ వదిలారు.పోస్టర్ లో కళ్యాణ్ రామ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. కింద పంచె పైన కోటు.. ఒక చేత్తో గన్ మరో చేత్తో కత్తి కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ లుక్ నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడికి కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఒక పెద్ద షిప్ కూడా కనిపిస్తుంది. మొత్తానికి కళ్యాణ్ రామ్ ఈసారి కూడా ఒక భారీ ప్రయోగంతోనే వస్తున్నారని తెలుస్తుంది. డెవిల్ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంతవరకు డిక్లేర్ చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement