Thursday, October 10, 2024

డెవిల్ షూటింగ్ లో.. క‌ల్యాణ్ రామ్ కి గాయాలు

హీరోగా తనదైన‌ వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్..లేటెస్ట్ గా చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఎలాగైన ఈసినిమాతో… సక్సెస్ సాధించి తన జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. తాజాగా డెవిల్ మూవీ షూటింగ్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గాయపడినట్లు స‌మాచారం.ఆయన నటిస్తున్న డెవిల్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో ఓ ఫైట్ సీన్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ కి ప్రమాదం జరగగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెందుతున్నారు.కాగా విశాఖలో .. ఈమూవీకి చెందిన యాక్షన్ సీన్స ను ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ కంపోజ్ చేస్తున్నారు. అన్నీ పనులు పూర్తి చేసి.. కుదిరితే ఈ సమ్మర్ వరకూ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది ఈహూవీ. అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement