Friday, April 19, 2024

కపిల్ డెవిల్స్ కప్ గెలిచి 38 ఏళ్లు..

టీమ్‌ఇండియా తొలి ప్రపంచకప్‌ అందుకుంది ఈ రోజే.. 1983, జూన్ 25న, సరిగ్గా ఇదే రోజున టీమ్‌ఇండియా తొలి ప్రపంచకప్‌ అందుకుంది. ఆ ఘనత సాధించి నేటికి 38 ఏళ్లు. ఆ ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా.. పటిష్ఠమైన వెస్టిండీస్‌తో తలపడింది. టాస్‌ ఓడిన కపిల్‌సేన మొదట బ్యాటింగ్‌ చేసి 183 పరుగులే చేసింది. విండీస్‌ విధ్వంసకరమైన బౌలింగ్‌ దాడికి నిలిచి క్రిస్‌ శ్రీకాంత్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌, సందీప్‌ పాటిల్‌ పరుగులు చేశారు. ఛేదనలో వివ్‌ రిచర్డ్స్‌, జెఫ్‌ డుజాన్‌ నిలిచినా.. మదన్‌ లాల్‌, అమర్‌నాథ్‌ చెరో 3 వికెట్లు తీసి 43 పరుగుల తేడాతో భారత్‌కు విజయం అందించారు. విండీస్‌ను 140 పరుగులకే పరిమితం చేశారు.

ఆ తరువాత ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో భారత్‌ 3 ఐసీసీ ట్రోఫీలు అందుకుంది. అయినా అభిమానులు మాత్రం కపిల్‌ డెవిల్స్‌ విజయాన్నే ఇప్పటికీ స్మరిస్తుంటారు. బీసీసీఐ, క్రికెటర్లు, అభిమానులు ఆనాటి మధుర స్మృతులను మరోసారి నెమరు వేసుకుంటున్నారు. ‘1983లో ఈరోజు: భారత క్రికెట్లో ఇదో చరిత్రాత్మకమైన రోజు. కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచింది’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, క్రికెటర్లు సైతం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇది కూడా చదవండి: టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారిన న్యూజిలాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement