Friday, March 29, 2024

కేయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను www.kakatiya.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ ఫస్టియర్‌ రెండో సెమిస్టర్‌లో 76.11 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. డిగ్రీ సెకండియర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌లో 85.71 శాతం, రెండో సెమిస్టర్‌లో 82.79 శాతం, డిగ్రీ మూడో సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌లో 85.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement