Monday, March 25, 2024

కాజ‌ల్ ద్విపాత్రాభిన‌యంతో ఘోస్టీ….

కాజల్‌ అగర్వాల్‌, సీనియర్‌ హీరోయిన్‌ రాధిక, కోలీవుడ్‌ నటు-డు యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ సినిమా ‘ఘోస్టీ’. కళ్యాణ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తీసుకొస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా గంగ ఎంట్టంన్మెంట్స్‌ అధినేత మాట్లాడుతూ ”ఘోస్టీలో కాజల్‌ అగర్వాల్‌ ద్విపాత్రా భినయం చేశారు. పోలీస్‌, హీరోయిన్‌ రెండు పాత్రల్లో ఆమె కనిపిం చనున్నారు. ఆత్మలకు, కాజల్‌ పాత్రలకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు- ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. సామ్‌ సిఎస్‌ సంగీతం ఈ చిత్రానికి మెయిన్‌ పిల్లర్‌” అని చెప్పారు.


షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలనుకునే దర్శకుడిగా యోగిబాబు కనిపించనున్నారు. హీరోయిన్‌ దగ్గరకు వెళ్ళబోయి పోలీస్‌ దగ్గరకు వెళతారు. యోగిబాబు మాత్రమే కాదు, చాలా మంది ఆ విధంగా కన్‌ఫ్యూజ్‌ అవుతారు. ఇందులో కె.ఎస్‌. రవికుమార్‌ గన్స్‌ డీల్‌ చేసే మాఫియా డాన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలోకి ఆత్మలు ఎలా వచ్చాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement