Tuesday, April 23, 2024

ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌ అంత్య‌క్రియ‌లు జూబ్లిహిల్స్ లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. గొప్ప నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జ‌రిగాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కైకాల పెద్ద కొడుకు రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement