Sunday, April 14, 2024

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న క‌డువా చిత్రం

పాన్ ఇండియా చిత్రం క‌డువా అమెజాన్ ప్రైమ్ లో ఆగ‌స్టు 4నుండి అన్ని భాష‌ల్లో రిలీజ్ కానుంది. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్విరాజ్‌కు జోడీగా ..హీరోయిన్‌ సంయుక్త మీన‌న్ న‌టించింది. వివేక్ ఓబెరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి పృథ్విరాజ్ ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జిను వి.అబ్ర‌హం క‌థ అందించాడు. పృథ్వీరాజ్ న‌టుడుగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా సినీ రంగంలో ప‌లు విభాగాల్లో ప‌నిచేస్తూ మాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయ‌న న‌టించిన కడువా పాన్ ఇండియా లెవల్లో విడుద‌లై ఘ‌న‌ విజ‌యం సాధించింది. షాజీ కైలాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలై 7న విడుద‌లై అన్ని భాష‌ల్లో డీసెంట్ కలెక్ష‌న్‌ల‌ను రాబ‌ట్టింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధ‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement