Thursday, August 5, 2021

కడెం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేత

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుకు కళ సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అప్రమత్తమైన అధికారులు.. కడెం ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ప్లో 38,419 క్యూసెక్కలు వస్తుండగా..ఔట్ ప్లో 49,874 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులుగా ఉంది.

మరోవైపు జిల్లాలోని  కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలకు వెంకూరు చెరువు కట్ట తెగిపోయింది. చెరువు నీరంతా వాగులోకి ప్రవహిస్తున్నది. వాగులో ఇద్దరు గ్రామస్తులు చిక్కుకుపోయారు. నీటి ప్రవాహంతో పలు గ్రామాల నుంచి కుంటాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News