Thursday, April 25, 2024

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోన్న క‌బ్జ.. కేక్ క‌ట్ చేసిన టీం

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది క‌బ్జ చిత్రం.ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర , కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్‌.చంద్రు ద‌ర్శకత్వం వహించారు. మార్చి 17న కన్నడ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. శివరాజ్‌ కుమార్‌, శ్రియా శరణ్‌, సుధ, మురళీ శర్మ, నవాబ్ షా, సునీల్ పురాణిక్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.కాగా ఉపేంద్ర అండ్ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. ఉపేంద్ర టీం కేక్‌ కట్‌ చేసి.. ఒకరికొకరు తినిపించుకుని కబ్జ సక్సెస్‌ను అందరితో పంచుకున్నారు. ఈ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కబ్జ మిగిలిన భాషల్లో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందంటున్నారు ట్రేడ్ పండితులు. మరి రానున్న రోజుల్లో కబ్జ చిత్రానికి ఎలాంటి స్పందన ఉండబోతున్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement