Monday, June 5, 2023

క‌బ్జాని రెండు బ్యాన‌ర్ ల‌పై రిలీజ్ చేస్తోన్న.. హీరో నితిన్

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన చిత్రం కబ్జా’. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. కన్నడ, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాది మార్చి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే లాస్ట్ ఇయిర్ ఈ బ్యానర్‌పై స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, దానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో విక్రమ్ సినిమా తరువాత మరో డబ్బింగ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు హీరో నితిన్ రెడీ అవుతున్నారు. ఈసారి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ చిత్రాన్ని టాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాను రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. కబ్జా చిత్రంలో ఉపేంద్రతో పాటు మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement