Tuesday, April 23, 2024

హోంమంత్రి అమిత్ షాతో కేఏ పాల్ భేటీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు, అక్రమాలు తన జీవితంలో ఎన్నడూ చూడలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విస్మయం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన నార్త్ బ్లాక్ లో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ దేశం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను అమిత్ షాతో చర్చించానని తెలిపారు. రాష్ర్టంలో కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు, దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. మనదేశం శ్రీలంకలా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపు 8 లక్షల కోట్లని, తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్లని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తనపై జరిగిన దాడిని కేంద్రమంత్రులు అమిత్ షా, రూపాల ఖండించారని చెప్పుకొచ్చారు. చైనా జీడీపీ, భారత్ జీడీపీ 33 ఏళ్ల క్రితం ఒకేలా ఉండేవని, ఇప్పుడు చైనా జీడీపీ ఆరు రెట్లు మన దేశం కన్నా ఎక్కువగా ఉందని పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుందని, పోరాటం చేస్తుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ డీజీపీని కలుస్తానంటే సమయం ఇవ్వలేదు గానీ కేంద్ర హోంమంత్రి తాను అడగగానే సమయం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు తనకు ఇచ్చే..

గౌరవాన్ని అందరూ చూడొచ్చన్నారు. ఇకపై కేసీఆర్, కేటీఆర్ అవినీతి చెల్లదని పాల్ అన్నారు. కేసీఆర్ తనపై దాడి చేయించారని ఆరోపించిన ఆయన, దాని  పరిణామాలు త్వరలో చూస్తారని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement