Tuesday, April 23, 2024

సుప్రీంకోర్టు కొలీజియంలోకి చేరనున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

సుప్రీంకోర్టు కొలీజియం లోకి రేపు మరో న్యాయమూర్తి వచ్చి చేరనున్నారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారీమన్ నేడు రిటైర్ అవుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు రేపు ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలో చేరనున్నారు. కాగా, జస్టిస్ రావు 6 జూన్ 2022 వరకు కొలీజియంలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో ఇతర న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారాల వంటి వాటి కోసం కొలీజియం వ్యవస్థను న్యాయమూర్తులు స్వయంగా రూపొందించారు. వచ్చే వారం నాటికి సుప్రీంకోర్టులో పది న్యాయమూర్తుల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేయడం కొలీజయం తక్షణ కర్తవ్యం. కొలీజియంలో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నారీమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ నుంచి తప్పించుకుంటోన్న వైరస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement