Saturday, April 20, 2024

నీ లాంటి ఫ్రెండ్ ప్ర‌తి ఒక్కరికి ఉండాల్సిందే.. నందినిరెడ్డికి హ్యాపి బ‌ర్త్ డే.. స‌మంత‌

స్టార్ హీరోయిన్ స‌మంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పోస్ట్ చేసింది. కాగా స‌మంత‌కి డైరెక్టర్ రాహుల్, సింగర్ చిన్మయి, డైరెక్టర్ నందిని రెడ్డి ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారిపై తన ప్రేమను తెలియజేస్తుంటుంది. ఈ రోజు డైరెక్టర్ నందినీ రెడ్డి పుట్టిన రోజు కావడంతో మరోసారి తనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ… ఆమెపై ప్రశంసలు కురిపించింది సామ్. జబర్దస్థ్, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు నందిని రెడ్డి. ఈ రెండు చిత్రాల్లో కథానాయికగా సమంత నటించింది. జబర్దస్త్ సినిమా సమయం నుంచే వీరిద్దరు మంచి స్నేహితులు. ప్రతి ఒక్కరి జీవితంలో నీలాంటి ఫ్రెండ్ ఒకరుండాల్సిందే. ఎప్పుడూ బాధలు దరికి రానివ్వరు. బాధ పడాల్సిన సమయంలోనూ నవ్విస్తుంటావ్. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావ్. నువ్వు లేకుండా నేనేం చేయగలను. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే” అంటూ నందిని రెడ్డితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది సమంత. ఆ పోస్ట్ కు నందినిరెడ్డి రిప్లై ఇచ్చింది. సామ్.. బిగ్ హాగ్స్.. లవ్యూ లోడ్స్ అంటూ కామెంట్ చేసింది.ఇప్పుడీ పోస్ట్ వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement