Wednesday, June 16, 2021

హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన జర్నలిస్ట్ రఘు భార్య

తన భ‌ర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన భార్య లక్ష్మీప్రవీణ‌ హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖలు చేశారు. పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించి ప్రతివాదుల‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. అరెస్ట్ అక్రమ‌మో.. కాదో తేలుస్తామ‌ని హైకోర్టు పేర్కొంది. బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాల‌ని హైకోర్టు సూచించింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లిన రఘును మధ్యలో అడ్డుకుని జీపులో ఎక్కించారు. పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్న తీరుపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News