Sunday, June 13, 2021

ప్రముఖ జర్నలిస్ట్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ రఘును గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించమే కాకుండా పోలీసులపై దాడులకు కారణమయ్యాడని రఘుపై పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్కాజ్‌గిరిలోని నివాసంలో రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు హుజూర్ నగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రఘును హుజూర్‌నగర్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.

కాగా రఘు అరెస్ట్ ఘటనపై కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ స్పందించారు. తన ఇంటర్వ్యూల ద్వారా ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తున్న రఘును అరెస్ట్ చేయడం సరికాదని, వెంటనే అతడిని విడుదల చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. అటు రఘు అరెస్టును పలు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించాయి.

ప్రముఖ జర్నలిస్ట్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
Advertisement

తాజా వార్తలు

Prabha News