Friday, March 29, 2024

చెంగారెడ్డిగా జోజు జార్జ్‌

పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్త నిర్మాణంలో రూపొందుతు న్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ద్వారా శ్రీకాం త్‌.ఎన్‌.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నా రు. శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
వైష్ణవ్‌ తేజ్‌ ఈ చిత్రంలో సరికొత్త మాస్‌ అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టు-కున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ప్రతినా యకుడి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్‌ ఓ కొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు. మలయాళ నటు-డు జోజు జార్జ్‌ ఈ చిత్రంలో చెంగా రెడ్డి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇరాట్ట, జోసెఫ్‌, నయత్తు, తురముఖం, మధురం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన పలు పురస్కారాలను సైతం అందుకున్నారు. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన పోషిస్తున్న చెంగా రెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బుధవారం విడుదల చేశారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టు-కొని, మరో చేత్తో లైటర్‌ తో నోట్లోని సిగరెట్‌ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో ఉన్న జోజు జార్జ్‌ పాత్ర తాలూకు పోస్టర్‌ పవర్‌ ఫుల్‌ గా ఆకట్టు-కునేలా ఉంది. ఈ చిత్రం -టైటిల్‌, చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించను న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement