Thursday, November 14, 2024

Test Cricket | జో రూట్ రికార్డుల‌ జోరు..

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ప‌లు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ తరఫున కుక్ 161 టెస్టుల్లో 12472 పరుగులు చేశాడు. జో రూట్‌ 147 టెస్టుల్లో ఈ ఘ‌నత‌ సాధించాడు. కాగా, ఈరోజు ముల్తాన వేదిక‌గా పాకిస్థాన్ తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ రికార్డుల‌ను సాధించాడు.

అలాగే టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్ వంటి దిగ్గజ క్రికెటర్ల సెంచరీలను అధిగమించాడు. టెస్టుల్లో గవాస్కర్, లారా, యూనిస్ తలా 34 సెంచరీలు చేశారు. ఇక‌ సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటిగ్ (41), కుమార సంగక్కర (38), రాహుల్ ద్రవిడ్ (36) ఈ జాబితాలో ఉన్నారు.

అదేవిధంగా టెస్టుల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా జో రూట్ కల్లిస్, స్టీవ్ స్మిత్‌లతో సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాడు. మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్ (4 సార్లు) అగ్రస్థానంలో ఉన్నారు. రూట్, కలిస్, స్మిత్ మూడు సార్లు 5+ సెంచరీలు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement