Wednesday, April 24, 2024

సింగరేణి లో కొలువులు..ఇలా అప్లై చేయండి..

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్ లో‌ వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ కోసం దరఖాస్తులను కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఈనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది.పోస్టు పేరు: ట్రేడ్‌ అప్రెంటిస్‌అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్ కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సబంధించిన అభ్యర్థులను లోకల్‌గాను, మిగిలిన జిల్లాల అభ్యర్థులను నాన్ లోకల్‌గా పరిగణిస్తారు. 80:20 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేస్తారు.

28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 28
వెబ్‌సైట్‌: www.scclmines.com/apprenticeship

Advertisement

తాజా వార్తలు

Advertisement