Thursday, April 25, 2024

గుజరాత్‌లో అన్ని జిల్లాలకు జియో 5జీ

గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాలకు ట్రూ 5జీ సేవలు అందించనున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా గుజరాత్‌లోని ఉన్న అన్ని జిల్లాలకు 5జీ సేవలు విస్తరించినట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుతం జియో 5జీ సేవలను పది ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్‌ స్టేట్‌ కింద గుజరాత్‌లోని విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా పలు రంగాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా 5జీ సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రిలయన్స్‌ ప్రకటించింది.
రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేపట్టిన ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం కింద తొలుత 100 స్కూల్స్‌లో డిజిటలైజేషన్‌ చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాలకు 5జీ అనుసంధానమైన రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదో, కోట్ల మంది జీవితాలను ఎలా ప్రభావితం చేయనుందోచూపించాలనుకుంటున్నామని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ అకాశ్‌ అంబానీ చెప్పారు.

నవంబర్‌ 23 నుంచి పుణేలో జియో ట్రూ 5జీ సేవలు 1జీబీపీఎస్‌ వేగంతో అందుబాటులోకి వచ్చాయి. గత వారం ఢిల్లిd ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో, గురగ్రామ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. గత నెలలో హైదరాబాద్‌, బెంగళూర్‌ల్లోనూ 5జీ సేవలు ప్రారంభించారు. జియో ట్రూ 5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతానికి వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే 1జీబీపీఎస్‌ వేగంతో అపరమిత డేటాను పొందవచ్చని రిలయన్స్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement