Wednesday, April 24, 2024

206 కోట్లతో టికెట్ కొన్నాడు..ఇప్పుడు బీజీగా ఉన్నా రాలేనంటున్నాడు..

అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం మీకు వస్తే కాదంటారా..ఆ అవకాశం ఎవరు వదులుకుంటారు.. అది కూడా వేలంలో కోట్లు పోసి టికెట్‌ కొంటే అస్సలు ఆ అవకాశాన్ని వదులుకోరు. కాని ఓ వ్యక్తి మాత్రం తాను బిజీగా ఉండటంతో స్పేస్ లోకి వెళ్లేందుకు రాలేనని చెప్పాడట..అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్‌తో కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థం ఈ నెల 20 న స్పేస్ ట్రిప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే గుర్తు తెలియ‌ని పాసింజ‌ర్ ఒక‌రు అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్‌తో క‌లిసి స్పేస్‌లోకి వెళ్లాల‌ని ఉబ‌లాట‌ప‌డ్డారు. దీనికోసం ఆ సీటు వేలం వేస్తే.. ఏకంగా 2.8 కోట్ల డాల‌ర్లు (రూ.206 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. తీరా స్పేస్ ట్రిప్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ నేను ఇప్పుడు బిజీ.. రాలేనంటున్నారు. బ్లూ ఆరిజిన్ చేసే భ‌విష్య‌త్తు ట్రిప్‌ల‌లో ఎప్పుడైనా వస్తాన‌ని ఆ పాసింజ‌ర్ స‌మాచారం పంపించారు.

అయితే పాసింజ‌ర్ స్థానంలో బ్లూ ఆరిజిన్ మ‌రో వ్య‌క్తిని ఎంపిక చేసింది. ఆ వ్య‌క్తి పేరు ఒలివ‌ర్ డేమెన్‌. వ‌య‌సు కేవ‌లం 18 ఏళ్లు మాత్ర‌మే. దీంతో అత‌ను స్పేస్‌లోకి వెళ్ల‌నున్న అత్యంత పిన్న వ‌య‌సు వ్య‌క్తిగా రికార్డు సృష్టించ‌నున్నాడు. అంతేకాదు బెజోస్‌తో మ‌రో వ్య‌క్తి 82 ఏళ్ల వాలీ ఫంక్ కూడా ఈ స్పేస్ ట్రిప్‌లో అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు. దీంతో స్పేస్‌లోకి వెళ్తున్న అత్యంత పెద్ద వ‌య‌సు వ్య‌క్తిగా ఈయ‌న రికార్డు సృష్టించ‌నున్నారు. వీళ్లిద్ద‌రే కాకుండా ఈ ట్రిప్‌లో బెజోస్ సోద‌రుడు మార్క్ కూడా ఉండ‌నున్నారు. న్యూ షెప‌ర్డ్ తొలి హ్యూమ‌న్ స్పేస్‌ఫ్లైట్‌.. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ నెల 20న ఉద‌యం 5 గంట‌ల‌కు నింగిలోకి ఎగ‌ర‌నుంది. ఈ లాంచ్‌ను BlueOrigin.com వెబ్‌సైట్‌లో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయ‌నున్నారు.

ఇది కూడా చదవండి : ఏపీలో ఇళ్లు, హోటళ్లకు విధించే చెత్త పన్ను వివరాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement