Thursday, March 28, 2024

ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పిన జీవిత..

మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వివాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌ లో పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి ఆసక్తి చూపటం లేదని మీడియాకు చెప్పారు. ఇటీవల ఓ వేడుకలో ఎన్‌టిఆర్‌ని కలిసినపుడు మా లో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారని, ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసారని జీవిత తెలిపారు.ఇక మంచు విష్ణు లైవ్ షోలో ఎన్టీఆర్ తనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చారన్నాడు. దీంతో జీవిత తను మీడియాతో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని, ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. తను ఎన్టీఆర్ నిరాసక్తత గురించి చెప్పిన విషయం మా మెంబర్లను తప్పుదోవ పట్టిస్తుందని అంగీకరించారు. ఎన్టీఆర్ కాజువల్ గా చర్చించిన విషయాలను తను మీడిమా ముందు వెల్లడించటం సమస్యగా మారిందని జీవిత అంగీకరించారు. మా లో నెలకొని ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత బాధగా ఉందని ఎన్టీఆర్ చెప్పారని, తనని ఓటు వేయమని అభ్యర్థించినప్పుడు తను ఏమీ చెప్పలేదన్న సంగతిని వివరించారు జీవిత.

ఇది కూడా చదవండి: కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. మాజీ మంత్రి ఈటలకు కీలక పదవి

Advertisement

తాజా వార్తలు

Advertisement