Friday, April 19, 2024

జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

అమరావతి,ఆంధ్రప్రభ: ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జెఇఇ మెయిన్స్‌ సెషన్‌-2 పరీక్షలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయింది. వారం రోజుల ఆలస్యంగా బుధవారం నుండి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యమయింది. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసం చెల్లించేందుకు మార్చి 12వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు అవకాశం ఉంటుందని ఈ పరీక్షలు నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టిఏ) తెలిపింది.

రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ మాసం 6,8,10,11,12 తేదీల్లో జరగనుండగా ఏప్రిల్‌ 13, 15 తేదీలను ఎన్‌టిఏ రిజర్వ్‌ చేసింది. పరీక్షలు నిర్వహించే నగరం, అడ్మిన్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌, ఫలితాలను ప్రకటించే తేదీలను ముందుగానే వెల్లడిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జెఇఇ మెయిన్స్‌ పరీక్షల మొదటి సెషన్‌కు రికార్డు స్తాయిలో ఎనిమిది లక్షల మంది హాజరయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement