Friday, April 19, 2024

జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్‌టీఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 4న పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయిని తెలిపింది. మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐఐటీ గువాహటి వెల్లడించింది. రిజిస్టర్‌ అయిన అభ్యర్థులు మే 5 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉండగా, ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి. 2023 ఏడాదికిగానూ ఐఐటీ గువాహాటి ఈ పరీక్ష నిర్వహిస్తుండటంతో ఈమేరకు ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేసింది. మరోవైపు జేఈఈ మెయిన్‌ పరీక్ష 2023 తేదీలను ఇప్పటికే ఎన్‌టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిసెషన్‌ను జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement