Friday, March 29, 2024

అట్లీ – షారుక్ ఖాన్ ల మూవీకి జ‌వాన్ టైటిల్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ. తాజాగా ఈ చిత్ర టైటిల్ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రానికి ‘జవాన్’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌లో షారుఖ్ మొహం చుట్టూ ప‌ట్టి క‌ట్టుకుని ఒంటి నిండా గాయాల‌తో.. ఒక డెన్‌లో చూట్టు గ‌న్స్‌తో ఉన్న టీజ‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. షారుఖ్ ఇప్ప‌టివ‌రకు చేయ‌లేని పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు టైటిల్‌ టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జూన్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు టీజ‌ర్‌లో వెల్ల‌డించారు. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌నున్నాడు. న‌య‌న‌తార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నుంది. బాలీవుడ్ భామ సాన్య మ‌ల్హోత్రా ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement