Monday, November 4, 2024

వారానికి నాలుగు రోజులే పనిదినాలు

ఎక్కడైనా వారానికి ఐదు లేదా ఆరు పనిదినాలు ఉండటం సాధారణ విషయం. కానీ జపాన్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా జీవన విధానంలో మార్పులు రావడంతో పని గంటలకు సంబంధించి జపాన్ సర్కారు కొత్త ఆర్థిక విధానాలతో వార్షిక మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో పనిదినాలు ఐదురోజులకు బదులు.. నాలుగు రోజులే ఉండాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పని-జీవితం ఈ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుని.. ఈ విధానాల్ని రూపొందించినట్లు పేర్కొంది. నెలలోపే ఈ నాలుగు రోజుల పనిదినాల పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా ప్రస్తుతం జపాన్‌లో ఉద్యోగులు వారానికి పనిచేస్తోంది ఐదు రోజులే. అదే నాలుగు రోజులు అయితే.. మహిళా ఉద్యోగులు ఆఫీసులో పనిచేసే సమయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం. అలాగే కుటుంబంపై కూడా మరింత శ్రద్ధ చూపేందుకు అవకాశం ఉంటుందని అంటోంది. ప్రజలు ఎక్కవ సెలవులు తీసుకుంటే ఖర్చు పెరిగి.. ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని జపాన్ సర్కారు భావిస్తోంది.

ఇది కూడా చదవండి: పెళ్లిలో మటన్ వండలేదని వివాహం రద్దు

Advertisement

తాజా వార్తలు

Advertisement