Tuesday, October 19, 2021

మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా పవన్ అభిమానుల ఆందోళన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనసేన మహిళ కార్యకర్తలు మంత్రి పేర్ని నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక కులానికి గానీ, ప్రాంతానికి గానీ చెందిన వ్యక్తి కాదన్నారు. మంత్రి పేర్నినాని నిన్ను తల్లో పేన్ను నలిపినట్లు నలుపుతామని హెచ్చరించారు.

మంత్రి పదవి కోసం మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ కాళ్ళు పట్టుకున్నారని ఈశ్వరయ్య విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడే హక్కు బెట్టింగులు ఆడించే మంత్రి అనిల్ యాదవ్‌కు ఉందా అని ప్రశ్నించారు. కారుకూతలు కూస్తే వైసీపీ మంత్రులకు ఇంకా పుట్టగతులు ఉండవని ఈశ్వరయ్య హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News