Monday, April 15, 2024

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం

జమ్మూ కాశ్మీర్ వరుస ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతోంది. తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజౌరీ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ( జేసీఓ)తో పాటు నలుగురు జవాన్లు మొత్తంగా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. సోమవారం ఒకే రోజు మూడు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి.

అనంత్ నాగ్, బందీపోరాలో ఉదయం పోలీసులు, టెర్రరిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులను బలగాలు మట్టుపెట్టాయి. తాజాగా రాజౌరీలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఆప్గన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న తరువాత నుంచి జమ్ము కాశ్మీర్లో తీవ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. మరోమారు భారత్ తో పెద్ద దాడి చేసేందుకు లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు పథకాలు రచిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్రవాద కుట్రల్ని భగ్నం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement