Wednesday, May 25, 2022

ఐపీఎల్‌కు జడేజా దూరం.. ఎందుకంటే..

సీఎస్‌కేకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు దూరమైన సీఎస్‌కేకు మరో దెబ్బ తగిలింది. ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన రవీంద్ర జడేజా.. ఐపీఎల్‌ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలున్నాయి. వ్యక్తిగతంగానూ ఫామ్‌ కోల్పోయిన జడేజా.. బౌలింగ్‌లోనూ పదును తగ్గింది. బ్యాటింగ్లో భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు.

గాయం కారణంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. డగౌట్కే పరిమితం అయ్యాడు. ఇక తాజాగా మిగిలిన మ్యాచ్‌లకు కూడా జడేజా దూరం కానున్నట్టు సమాచారం. రాయల్‌ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో రవీంద్ర జడేజా డైవ్‌ చేయగా.. ఛాతిపై గాయాలయ్యాయి. ఆ తరువాత ఢిల్లిdతో పాటు ముంబైతో జరిగిన మ్యాచుల్లో ఆడలేదు. మిగిలిన గుజరాత్‌, రాజస్థాన్‌ మ్యాచ్‌ల నుంచి కూడా తప్పుకుంటాడని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement